రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన... షెడ్యూల్ ఖరారు

  • చీమకుర్తి రానున్న సీఎం జగన్
  • వైఎస్సార్, బూచేపల్లి సుబ్బారెడ్డిల విగ్రహాల ఆవిష్కరణ
  • ఇంజినీరింగ్ కాలేజీలో బహిరంగ సభ
  • మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లి తిరుగుపయనం
సీఎం జగన్ రేపు (ఆగస్టు 24) ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ను సీఎంవో ఖరారు చేసింది. సీఎం ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. ఉదయం 10.35 గంటలకు చీమకుర్తి చేరుకుంటారు. ఉదయం 10.55 గంటలకు చీమకుర్తి మెయిన్ రోడ్డులోని బూచేపల్లి కల్యాణమండపం వద్ద  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం, బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లి తిరుగుపయనమవుతారు. 

సీఎం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ మల్లికా గార్గ్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీతో పాటు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

CM Jagan
Prakasam District
Cheemakurti
YSRCP

More Telugu News